వ్యక్తిగత రుణాలు వెంటనే ఆమోదించాలంటే?

23 May, 2021 18:05 IST|Sakshi

కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరికి ఎన్నోపాఠాలు నేర్పింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్ధిక వంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియజేసింది. భవిష్యత్ అవసరాల కోసం ముందస్తు జాగ్రత్తలు అవసరం అని తెలిపింది. ఈ మహమ్మరి కాలంలో ఎక్కువ శాతం వ్యక్తిగత ప్రజలు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ పరిస్థితులలో తీసుకోవడం అంత మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే, వారి ఆదాయం విషయంలో ఎటువంటి గ్యారెంటీ ఉండదు. కానీ, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం తప్పేలా లేదు. అయితే, ఈ రుణాల కోసం బ్యాంకుల నుంచి ఆమోదం పొందడం అంత సులభం కాదు

ప్రధానంగా ఎవరికి అయితే అత్యంత అవసరం ఉంటుందో వారు తీసుకోవడం మంచిది. చాలా మంది ఎంచుకునే ఋణాలలో వ్యక్తిగత రుణం ఒకటి. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాక వారు మీ ప్రతి వివరాలను పరీక్షిస్తారు. కానీ, చాలా మంది చిన్న చిన్న కారణాల వల్ల వారి ధరఖాస్తులు రద్దు చేయబడుతున్నాయి. వ్యక్తిగత రుణం కోసం ఆమోదం పొందే అవకాశాలను మీరు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి
క్రెడిట్ స్కోరు అనేది మూడు అంకెల సంఖ్య, ఇది దరఖాస్తుదారుడి క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది. దీని వల్ల గతంలో మీరు తీసుకున్న రుణాలకు సంబందించిన చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. గతంలో మీరు ఎప్పుడైనా తీసుకున్న ఋణాల ఈఎంఐ సకాలంలో చెల్లించరా? లేదా? అనే ప్రతి విషయం వారి దగ్గర ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే తొందరగా రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. మొదట, మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి? అవసరమైతే, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సంపాదిస్తున్నారని వారికి తెలియాలి. తక్కువగా ఉద్యోగాలు మారే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.  

సహ దరఖాస్తుదారు 
మీకు తగినంత ఆదాయం లేకపోతే, తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న లేదా బ్యాంకులు నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాలు లేకపోయిన, మీరు మంచి ఆదాయం, క్రెడిట్ స్కోర్ గల వ్యక్తితో కలిసి ఉమ్మడిగా రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ లేకపోతే మీకు ఇది సహాయపడుతుంది. ఎందుకంటే సహ దరఖాస్తుదారుడు కూడా రుణం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి ధరఖాస్తు వల్ల ఎక్కువ మొత్తం రుణం లభించే అవకాశం ఉంది.

ఉద్యోగ చరిత్ర 
ఉద్యోగ చరిత్ర మీ ఆదాయంతో సహా అందులో స్థిరత్వాన్ని చూపిస్తుంది. దరఖాస్తు దారులు తరచూ ఉద్యోగాలు మారుతున్నట్లయితే లేదా స్థిర ఆదాయం లేనట్లయితే వారి విషయంలో రిస్కు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే తరహా ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే కంపెనీని ఎక్కువ స్థిరత్వంగా పరిగణిస్తాయి. అంటే ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని కూడా అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా రుణాలు కోసం ధరఖాస్తు చేయకండి
అనేక బ్యాంకులలో రుణాలు ధరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ క్షీణించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బ్యాంకులు రుణం ఆమోదించే అవకాశం తక్కువగా ఉంటుంది. రుణ దరఖాస్తును తిరస్కరిస్తే మళ్లీ ఆరు నెలల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ప్రయతించండి. అలాగే, మీకు ఆదాయం తక్కువగా ఉంటే ఎక్కువ ఈఎంఐలు తీసుకుంటే మంచిది. దీని వల్ల మీరు తక్కువ ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.

చదవండి:

బిగ్ బజార్ బంపర్ ఆఫర్

మరిన్ని వార్తలు