Electric Tractor: ఈవీలో సెగ్మెంట్‌లో హైదరాబాద్‌ హవా.. మెక్సికన్‌ మార్కెట్‌పై ఫోకస్‌

8 Feb, 2022 10:45 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో హైదరాబాద్‌ హవా కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లుగా ఈవీ సెగ్మెంట్‌లో పని చేస్తున్న కంపెనీలు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయి. తాజాగా సెలెస్టియల్‌ ఈ మొబిలిటీ సంస్థ తమ ఈ ట్రాక్టర్లను మెక్సికన్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది.

సెలెస్టియల్‌ ఈ మొబిలిటీ కంపెనీ 2019లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ మొత్తం 35 రకాల వాహనాలను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 2500 డీలర్‌షిప్‌ కేంద్రాలతో పాటు 800 సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి. 2020 మార్చిలో ఇ ట్రాక్టర్‌ను ప్రవేశపెట్టగా మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1800 ట్రాక్టర్లు బుక్‌ అయ్యాయి. ఇ ట్రాక్టరులో 150 ఏఎహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ అమర్చారు. ఇ ట్రాక్టర్‌లో 18 బీహెచ్‌పీ, 15 ఎన్‌ఎం టార్క్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. 

ఇండియన్‌ మార్కెట్‌లో మంచి స్పందన రావడంతో విదేశాలకు తమ ట్రాక్టర్లను ఎగుమతి చేసే యత్నంలో ఉంది సెలెస్టియల్‌ సంస్థ. అందులో భాగంగా మెక్సికన్‌ కంపెనీ గ్రూపో మార్వెల్‌సా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాబోయే మూడేళ్లలో మెక్సికో మార్కెట్‌లో 4000 ఇ ట్రాక్టర్లు విక్రయించడం ఈ ఒప్పందం లక్ష్యం. త్వరలోనే అమెరికా మార్కెట్‌లోనూ అడుగు పెడతామని సెలెస్టియల​ ఈ మొబిలిటీ ఫౌండర్‌, సీఈవో సిద్ధార్థ దురైరాజ్‌ తెలిపారు. 

చదవండి: ప్రారంభానికి ప్రైవేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ రెడీ 

మరిన్ని వార్తలు