కెయిర్న్‌ వివాదం: భారత్‌కు ఎదురుదెబ్బ

23 Dec, 2020 20:47 IST|Sakshi

కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్ కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ!

వడ్డీతో సహా  రూ. 8 వేల కోట్లు చెల్లించాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : పన్ను వివాదంలో భారత ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీ సంస్థ వివాదంలో భారత్ కు అంతర్జాతీయ కోర్టు రూ. 8 వేల కోట్ల జరిమానాను విధించింది.  కెయిర్న్ ఎనర్జీకి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో  అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం(ఆర్బిట్రేషన్) కెయిర్న్ ఎనర్జీ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు పన్నులను చెల్లించాల్సిన అవసరంలేదంటూ దీంతో తాజా  ఆదేశాలు జారీ  చేసింది. పన్ను వివాదం కేసుల్లో అంతర్జాతీయ కోర్టులో భారత్ ఇటీవలి కాలంలో  ఇది రెండవ ఎదురుదెబ్బ. ఈ ఏడాది సెప్టెంబరులో సెప్టెంబరులో వోడాఫోన్ గ్రూప్ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులో విజయం సాధించిన తరువాత  ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా  భావిస్తున్నారు.

యుకే-ఇండియా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ప్రకారం కైర్న్‌కు భారత్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని,  భారత్ ఆపేసిన పన్ను రిటర్న్ రీఫండ్, డివిడెండ్లతో పాటు పన్ను వసూళ్ల కోసం విక్రయించిన షేర్ల సొమ్ముకు వడ్డీతో సహా రూ. 8,000 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. కాగా దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కెయిన్ సంస్థ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా భార‌త్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కోర్టు ఆరోపించింది. కెయిన్ ట్యాక్స్ వివాదం కేవ‌లం ప‌న్ను వివాదం మాత్ర‌మే కాదు అని, అది ప‌న్ను పెట్టుబ‌డికి సంబంధించిన వివాదమని వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలోనే ఈ కేసు త‌మ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని హేగ్ కోర్టు వెల్ల‌డించింది.  

మరిన్ని వార్తలు