UP Scorpio Accident Death: ఆనంద్‌ మహీంద్రపై చీటింగ్‌ కేసు, కంపెనీ క్లారిటీ ఇది

27 Sep, 2023 15:22 IST|Sakshi

తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్‌ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్‌లో ఎలాంటి  లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. 

దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో  ఎయిర్‌బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా  కారులో ఎయిర్‌బ్యాగ్‌లు  ఓపెన్‌ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని  ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్‌బ్యాగ్‌ల లోపం లేదని  తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్‌  ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌  కావని తెలిపింది.  దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజేష్‌ మిశ్రా ఫిర్యాదు మేరకు  మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్‌ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్  కాకపోవడం వల్లనే  తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్‌ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. 

మరిన్ని వార్తలు