ఫార్మా డే..300 పాయింట్లు జంప్

10 Aug, 2020 09:31 IST|Sakshi

38,300 ఎగువకు సెన్సెక్స్

11300 ఎగువన నిఫ్టీ

ఫార్మా అప్, ఐటీ డౌన్

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత ఎగిసి కీలక మద్దతు స్థాయిలను అధిగమించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగిసి 38347 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11306 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్  38300 ఎగువన ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 11300 స్థాయిని  అదిగమించింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్, ఫార్మ రంగ షేర్లు  ఉత్సాహంగా  ఉన్నాయి. మరోవైపు  ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ క నిపిస్తోంది. 

బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, ఎంఅండ్ఎం , ఇండస్ఇండ్ బ్యాంక్ , ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సిప్లా  టాప్ గెయినర్ గా ఉంది. దివీస్, సన్ ఫార్మాలాభాలతో నిఫ్టీ ఫార్మా 400పాయింట్లకు పైగా లాభాలతో ఉంది. 

మరిన్ని వార్తలు