కొత్త ఏడాదిలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు..!

1 Apr, 2022 10:05 IST|Sakshi

2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను దేశీయ సూచీలు 18 శాతం మేర జంప్‌ అయ్యాయి. యుద్ద భయాలు ఉన్నప్పటీకి గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు రూ. 59 లక్షల కోట్లను వెనకేశారు. ఇక ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. శుక్రవారం రోజున దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. 

ఉదయం 9.55 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 58, 718 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 17,522.60 వద్ద ట్రేడవుతుంది. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిగ్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌కార్ప్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

చదవండి: భయపెట్టని యుధ్దం..! రూ. 59.75 లక్షల కోట్లను ఇట్టే వెనకేశారు..!

మరిన్ని వార్తలు