మెర్సిడెస్‌ ఈవీ,మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 857 కిలోమీటర్లు రయ్‌!

1 Oct, 2022 08:46 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్‌లో ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ తయారీ ప్రారంభించింది. జర్మనీ వెలుపల భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్‌ వాహనం ఇదే కావడం విశేషం. 14వ మేడిన్‌ ఇండియా మోడల్‌గా ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ నిలిచింది.

ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్‌లో అత్యధిక దూరం ప్రయాణించే కారుగా ఇది స్థానం దక్కించుకుంది.

ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్‌లో 15 నిముషాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించ గలిగే స్థాయిలో చార్జింగ్‌ పూర్తి అవుతుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.55 కోట్లు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు.

చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త సేవలు రాబోతున్నాయ్‌!

మరిన్ని వార్తలు