భారీగా పెరిగిన ముఖేష్ అంబానీ సంపద

6 Sep, 2021 17:17 IST|Sakshi

ముంబై: భారతీయ కుభేరుడు.. అసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద భారీగా పెరిగింది. ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క రోజులోనే(సెప్టెంబర్ 3) 3.71 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంపద ఇంతభారీగా పెరగడానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర పెరగడమేనని తెలుస్తోంది. కంపెనీ షేర్ల విలువ ఇటీవల పెరిగిన నేపథ్యంలో 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువతో బిలియనీర్ల ప్రత్యేక క్లబ్ లోకి ప్రవేశించడానికి దగ్గరగా ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు.

ఆర్ఐఎల్ షేర్లు సోమవారం(సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద ఉన్నాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది.(చదవండి: అడుగేస్తేనే కరెంట్‌ పుడుతుంది మరి!)

లోకల్‌ సెర్చి ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. 2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు