సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్‌ త్రీడీ ప్రింటర్‌' - ధర ఎంతంటే?

28 May, 2023 09:10 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది త్రీడీ ప్రింటర్‌. హాంకాంగ్‌కు చెందిన త్రీడీ ప్రింటర్ల తయారీ సంస్థ ‘ఎనీ క్యూబిక్’ దీనిని తాజాగా రపొందించింది. ఈ అల్ట్రాస్పీడ్‌ త్రీడీ ప్రింటర్‌ మోడల్‌ పేరు ‘ఎనీక్యూబిక్‌ కోబ్రా2’. ఇది మిగిలిన త్రీడీ ప్రింటర్లతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా కోరుకున్న వస్తువులను ముద్రించగలదు. 

దీనిని పది నిమిషాల్లోనే అసెంబుల్‌ చేసుకోవచ్చు. దీనికి ఉన్న 4.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ద్వారా ప్రింట్‌ చేయాలనుకున్న వస్తువుల తీరుతెన్నులను సవరించుకోవచ్చు. ఇది లెవిక్యూ-2.0 ఆటో లెవెలింగ్‌ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఈ ప్రింటర్‌ సెకనుకు 250 మిల్లీమీటర్ల వేగంతో వస్తువులను ముద్రిస్తుంది. ప్రాజెక్టులు, వర్క్‌షాపుల కోసం అనువుగా ఉండేలా దీనిని రపొందించారు. స్వల్పవ్యవధిలోనే ప్లాన్లు, డిజైన్లు చేయాలనుకునే ఇంజినీర్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని ధర 499 డాలర్లు (ర. 41,098) మాత్రమే!

మరిన్ని వార్తలు