మళ్లీ 11 ఏళ్ళకి నోకియా ల్యాప్‌టాప్

13 Dec, 2020 15:40 IST|Sakshi

భారతదేశంలో ప్యూర్‌బుక్ సిరీస్‌లో భాగంగా నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14ని మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా తీసుకొస్తునట్లు ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌డేట్ వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్‌సైట్‌లోని జాబితాలో కొన్ని నోకియా ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మొదటగా బయటకు వచ్చాయి. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్)

నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 ఫీచర్స్ 
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 వేరియంట్ లో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అందించనున్నారు. మైక్రోసైట్ ప్రకారం డాల్బీ విజన్ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ యొక్క బరువు 1.1 కిలోగ్రాములు. నోకియా ల్యాప్‌టాప్ చిత్రంలో యుఎస్‌బి 3.0 మరియు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14ను ఎప్పుడు తీసుకొస్తున్నారో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. నోకియా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసిన ప్రకారం మొత్తం 9 మోడళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో 5 మోడళ్లను i5 ప్రాసెసర్ సపోర్ట్ తీసుకొస్తుండగా, మిగతా నాల్గింటిని i3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇవి పదో తరం ఇంటెల్ ప్రాసెసర్లు అయ్యే అవకాశం ఉంది. కొత్త ల్యాప్‌టాప్‌లు నోకియా బ్రాండింగ్‌ను కలిగి ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ చేత తయారుచేసినట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనున్నాయి.   
 

మరిన్ని వార్తలు