రెట్టింపు ఏయూఎంపై పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ దృష్టి

21 Sep, 2023 07:34 IST|Sakshi

ముంబై: ఇన్వెస్టర్‌ డే సందర్భంగా పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఈఎల్‌) తమ దీర్ఘకాలిక వృద్ధి, లాభదాయకత ప్రణాళికలను ఆవిష్కరించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని (ఏయూఎం) రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 

అప్పటికల్లా ఏయూఎంను రూ. 1.2–1.3 లక్షల కోట్లకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. తమ రిటైల్‌ వ్యాపారంలో హోల్‌సేల్‌ విభాగం వాటాను 33 శాతానికి, రిటైల్‌ విభాగం వాటాను 67 శాతానికి పెంచుకోవడం ద్వారా దీన్ని సాధించే యోచనలో ఉన్నట్లు వివరించింది. 

అటు 2024 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఈఎల్‌ రిటైల్‌ రుణాల వ్యాపారం 57 శాతం పెరిగి రూ. 34,891 కోట్లకు చేరింది. జూన్‌ ఆఖరు నాటికి కంపెనీకి 423 శాఖలు, 33 లక్షల పైచిలుకు కస్టమర్లు, సుమారు 13 రకాల రుణ సాధనాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు