కేంద్రం కొత్త రూల్స్‌..ట్యాబ్లెట్, సిరప్‌ కొనుగోలుదారులకు ముఖ్యగమనిక

18 Nov, 2022 19:45 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న డ్రగ్‌ రూల్స్‌ (ఫార్మాస్యూటికల్‌)ను సవరించింది. ఈ రూల్స్‌ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం..డ్రగ్‌ రూల్స్‌ (ఎనిమిదవ సవరణ)- 2022లో భాగంగా కాల్పోల్,అల్లేగ్రా,బెటాడిన్, గెలుసిల్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్‌ ప్యాకేజింగ్ లేబుల్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను తప్పని సరి చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా నకిలీ మెడిసిన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. 

ఆగస్ట్‌ 1, 2023 నుంచి 
కొత్త డ్రగ్‌ రూల్స్‌ ఆగస్ట్‌ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. షెడ్యూల్ హెచ్‌2లో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌ (ప్రైమరీ ప్యాకేజీ లేబుల్‌) పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి. ప్రాథమిక ప్యాకేజీ లేబుల్‌లో తగినంత స్థలం లేకపోతే, నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్‌పై ప్రామాణీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తో చదవగలిగే డేటా ఉంచాలని’ స్పష్టం చేసింది

క్యూఆర్‌ కోడ్‌తో 
క్యూఆర్‌ కోడ్‌ సాయంతో మెడిసిన్‌ తయారీ చేసిన ప్రొడక్షన్‌ కోడ్‌, డగ్స్‌ సరైన..సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు,చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్‌ తేదీ, ఎక్స్‌పైయిరీ డేట్ (గడువు తేదీ). లైసెన్స్ నంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది. కాగా, నకిలీ మెడిసిన్‌ లేదా సిరప్‌ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా, బ్రిటన్,జర్మనీ,అమెరికా తోపాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్‌ కోడ్‌ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు