షాకింగ్‌: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం 

24 Feb, 2023 19:46 IST|Sakshi

సాక్షి,ముంబై: స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్‌ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. లోకల్‌ బిజినెస్‌ను బట్టి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయిని ప్రకటించిన ఎరిక్సన్‌ సీఈవో బోర్జే ఎఖోల్మ్ ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈమెయిల్‌ సమాచారం అందించినట్టు తెలుస్తోంది.   (ఉబెర్‌ కొత్త డిజైన్‌: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!)

టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుననాయి. అయితే టెలికాం పరిశ్రమలో  ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి.  కాగా స్వీడన్‌లో దాదాపు 1400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల  ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించిన  ట్విటర్‌,  గూగుల్, మెటా ,మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల లీగ్‌లో ఎరిక్సన్ చేరింది. (పేటీఎం యూజ‍ర్లకు గుడ్‌న్యూస్‌ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్‌...క్యాష్‌ బ్యాక్‌ కూడా!)

మరిన్ని వార్తలు