Rolls-Royce: 111 ఏళ్ల తరువాత రోల్స్‌ రాయిస్‌ సంచలన నిర్ణయం..!

11 Feb, 2022 15:42 IST|Sakshi

ప్రముఖ ప్రీమియం లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 111 ఏళ్ల తరువాత రోల్స్‌ రాయిస్‌కు చెందిన స్పిరిట్‌ ఆఫ్‌ ఎక్ట్ససీ ఐకానిక్‌ మస్కట్‌ను రిడిజైన్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

ఈవీ కార్‌లో ప్రత్యక్ష్యం..!
కొత్త బ్రాండ్ మస్కట్ రోల్స్‌ రాయిస్‌కు చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌లో మొదటగా రానుంది. ఈ మస్కట్‌కు మరింత ఏరోడైనమిక్‌ డిజైన్‌తో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక రోల్స్‌ రాయిస్‌ నుంచి రాబోయే స్పెక్టర్ ఈవీ ఏరోడైనమిక్‌ డిజైన్‌లో అత్యంత  సమర్థవంతమైన కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది.  


 

డిజైన్‌లో చిన్నపాటి మార్పులు..!
రోల్స్‌ రాయిస్‌ మస్కట్‌ను బ్రిటీష్‌ డిజైనర్‌ చార్సెల్‌సైక్స్‌ రూపొందించారు. దీనిని మరింత డైనమిక్‌ వైఖరితో మస్కట్‌ పునర్నిర్మించనున్నారు. కొత్త మస్కట్ ప్రస్తుత డిజైన్ కంటే దాదాపు 17 మిమీ తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 82.7 మిమీ పొడవుతో రానుంది. ఈ కొత్త మస్కట్‌కు సమర్థవంతమైన ఏరోడైనమిక్‌ డిజైన్‌ను అందించేందుకుగాను  ఈ మోడల్‌ను నిర్మించేందుకు విండ్ టన్నెల్ టెస్టింగ్‌లో దాదాపు 830 గంటలు పట్టిందని కంపెనీ పేర్కొంది. 

చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్‌ కార్డ్‌..!


 

మరిన్ని వార్తలు