State Bank Of India: ఎస్‌బీఐ ఆఫర్‌, రూ.342తో రూ.4 లక్షల బెన్‌ఫిట్‌

1 Nov, 2021 15:18 IST|Sakshi

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌  ప్రీమియంలపై కీలక ప్రకటన చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్స్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పథకాల్లోని ఇన్స్యూరెన్స్‌ పాలసీలపై రూ. 342 ప్రీమియం చెల్లిస్తే రూ.4 లక్షలు బెనిఫిట్‌ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎస్‌బీఐ చెప్పింది.    

కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో ఇన్స్యూరెన్స్‌ పాలసీలకు డిమాండ్‌ పెరిగింది. మహమ్మారి నుంచి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు పాలసీ దారులు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఆయా ఇన్స్యూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి భీమా యోజన( పీఎంజేజేబీవై) స్కీమ్‌లను అందుబాటులోకి  తెచ్చింది.  

అయితే తాజాగా ఎస్‌బీఐ ఈ స్కీములకు సంబంధించిన ప్రీమియం అంశంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న పాలసీదారులు ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకం కింద సంవత్సరానికి రూ.12 ప్రమియం చెల్లిస్తే యాక్సిడెంట్‌లో మరణించినా, పూర్తిగా వికలాంగులైనా రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతను/ఆమె రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.  ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో 18 నుంచి 50ఏళ్ల లోపు వయస్సున్న సభ్యులు పాలసీ కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు పరిహారాన్ని అందిస్తున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఈ ప్రీమియం ధర  సంవత్సరానికి రూ.330గా ఉందని చెప్పింది. 

మరిన్ని వార్తలు