మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌

13 Dec, 2022 11:53 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రభుత్వ రంగ  బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును పెంచింది. సవరించిన​ వడ్డీ రేట్లు నేటి (2022 డిసెంబర్​ 13) నుంచి అమల్లో ఉంటాయని ఎస్‌బీఐ అధికారిక ప్రకటలో తెలిపింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.  

తాజా సవరణతో 7-45 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 3 శాతం, 46-179 రోజుల మధ్య ఎఫ్​డీపై 3.9 శాతం, 180-210 రోజుల మధ్య 5.25 శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్​డీలపై 5.75శాతం వడ్డీ చెల్లింస్తుంది. 1-2 ఏళ్ల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 6.75 శాతం, 2-3 మూడేళ్ల వరకు అయితే 6.75 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు.. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అయితే 6.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్‌ వెరిఫైడ్‌ మార్క్‌ షురూ)

అలాగే సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తుంది. తాజా సవరణతో, సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది.

కాగా ద్రవ్యోల్బణం ఆందోళన నేపథ్యంలో కేంద్రబ్యాంకు ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి కూడా వడ్డీరేటు పెంపునకే మొగ్గు చూపింది. తాజా పాలసీ రివ్యూలో రెపో రేటు 35 బేసిస్‌ పాయింట్లకు పెంచింది.  (సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం)

మరిన్ని వార్తలు