ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి

15 Aug, 2022 15:54 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ   దిగ్గజ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)  ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు  చేసే  మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును మరోసారి పెంచింది. తాజాగా ఎంసీఎల్‌ఆర్‌ రేటును 20 బీపీఎస్‌ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై మరింత భారం మోపింది. బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (EBLR), రెపో-లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్‌ పాయింట్ల మేర పెంచింది. ఆగస్టు 15 నుండి సవరించిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చినట్టు బ్యాంకు  ప్రకటించింది.  

ఓవర్‌నైట్ నుండి మూడు నెలల వరకు  ఎస్బీఐ  MCLR రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. సంవత్సర పరిధి లోన్లపై 7.90 శాతం, రెండేళ్లు,మూడు సంవత్సరాల  8 శాతంగా ఉంచింది. మూడు నెలల్లో మూడో పెంపు ఇది. ఇటీవల ఆర్బీఐ  రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు