ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

15 Jul, 2021 17:06 IST|Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్ లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము, గౌరవనీయ ఖాతాదారులు మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము" అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐ కస్టమర్లు జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యోనో మరియు యోనో లైట్ సర్వీసులను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక "ముఖ్యమైన నోటీసు"లో తెలిపింది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం మంచిది.

మరిన్ని వార్తలు