ఎస్‌బీఐ బంపరాఫర్‌, స్టార్టప్‌ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారా?

17 Aug, 2022 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు అవసరమైన ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లకు హబ్‌గా ఉంటున్న బెంగళూరులోని కోరమంగళలో తొలి బ్రాంచీని మంగళవారం ప్రారంభించింది.

ప్రారంభ దశ మొదలుకుని స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ అయ్యే వరకూ అంకుర సంస్థలకు అవసరమైన తోడ్పాటును ఈ శాఖ అందిస్తుందని బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా తెలిపారు. ఈ శాఖ అనుభవాలను పరిశీలించి, వచ్చే ఆరు నెలల్లో గురుగ్రామ్‌లో రెండోది, హైదరాబాద్‌లో మూడోది ప్రారంభించనున్నట్లు వివరించారు.

రుణాలు, డిపాజిట్లు, రెమిటెన్సులు, చెల్లింపులు, ఫారెక్స్, బీమా తదితర సర్వీసులు, న్యాయ సలహాలు, డీమాట్‌.. ట్రేడింగ్‌ ఖాతాలు మొదలైనవన్నీ ఎస్‌బీఐ స్టార్టప్‌ బ్రాంచ్‌లో పొందవచ్చు. స్టార్టప్‌ వ్యవస్థలో భాగంగా ఉండే వివిధ వర్గాలన్నింటికీ అవసరమైన ఆర్థిక, సలహాలపరమైన సర్వీసులను ఇది అందిస్తుంది. 

మరిన్ని వార్తలు