తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు..!

19 Apr, 2022 10:05 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఒక రోజులోనే 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మంగళవారం కూడా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, టోకు ద్రవ్యోల్భణం తారస్థాయికి చేరాయి. దీనికి తోడు ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుందనే వార్తలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంది. ఫలితంగా మంగళవారం  దేశీయ సూచీలు నష్టాలో ట్రేడవుతున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశం ఉందనే వార్తలు ఏషియన్‌ స్టాక్‌​ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 

ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 225 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 57,390 వద్దకు చేరుకోగా వెంటనే నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 9.55 సమయంలో 80.80 పాయింట్లు నష్టపోయి 57, 092.40 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా ప్రారంభంలో 85 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగింది.ఉదయం 9. 55 సమయంలో 4 పాయింట్ల లాభంతో 17,178.15 వద్ద ట్రేడవుతోంది. 

టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్‌,  డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్ ,కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

చదవండి: భారీ నష్టాలు.. ఒక్క రోజులో 3.39 లక్షల కోట్ల సంపద ఆవిరి!

మరిన్ని వార్తలు