DearNothing Controversy: వివాదంలో స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ,'డియర్‌ నథింగ్‌'..చూసుకుందాం పదా!

13 Jul, 2022 13:20 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ వన్‌ప్లస్ కో- ఫౌండర్‌ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్ ను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి నథింగ్‌ ఫోన్‌(1) మంగళవారం భారత్‌ మార్కెట్‌లో విడుదలైంది. అయితే ఈ ఫోన్‌ తయారీ సంస్థపైన దక్షణాదికి చెందిన స్మార్ట్‌ ఫోన్‌ లవర్స్‌, టెక్నాలజీ కంటెంట్‌ క్రియేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నథింగ్‌ ఫోన్‌(1) విడుదలైన కొన్ని గంటల్లోనే ఆఫోన్‌ విడుదల, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయనే అంశాలతో సంబంధం లేకుండా డియర్‌ నథింగ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. అదే సమయంలో కార్ల్‌ పీ'ని విమర్శిస్తూ హ్యాష్‌ ట్యాగ్స్‌తో ట్వీట్‌ చేస్తున్నారు.  

డియర్ నథింగ్: అసలు ఏం జరిగింది?
ప్రముఖ తెలుగు టెక్‌ యూట్యూబ్ క్రియేటర్‌ విడుదలైన ఫోన్‌(1) గురించి ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. ఫోన్‌ రివ్వ్యూ ఇవ్వాలని ఆ ఫోన్‌ కంపెనీ పేరుతో ఉన్న బాక్స్‌ను ఓపెన్‌ చేసి చూడగా అందులో హాయ్‌ **** దిస్‌ డివైజ్‌ ఈజ్‌ నాట్‌ ఫర్‌ సౌత్‌ ఇండియన్‌ పీపుల్‌ అని ఓ పేపర్‌లో రాసి ఉంటుంది. అంతే మనదేశానికి చెందిన ప్రాంతీయ కంటెంట్‌ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ యూనిట్‌లు ఇవ్వలేదని విమర్శిస్తూ ఆ వీడియోను తయారు చేశాడు. రివ్వ్యూ యూనిట్లు ఇవ్వాలనేది కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు.  

అలా నథింగ్‌ ఫోన్‌(1)ను విమర్శిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్‌ కంటెంట్‌ క్రియేటర్లు సైతం ఆ ఫోన్‌పై వీడియోలు చేశారు. అవికాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో సౌత్‌కు చెందిన నథింగ్‌ ఫోన్‌(1) కొనుగోలు దారులు సైతం.. #డియర్‌ నథింగ్‌..పదా చూసుకుందాం, #బాయ్‌కాట్‌నథింగ్‌ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. కాగా, ఈ నథింగ్‌ ఫోన్‌ సంస్థ ప్రమోషన్‌ కోసం క్రియేటర్లకు ఇలా లెటర్‌ అలా పంపిందా? లేదంటే నార్త్‌ కంటెంట్‌ క్రియేటర్లకు రివ్వ్యూ యూనిట్లు పంపి.. తమకు పంపలేదనే కోపంతో దక్షిణాదికి చెందిన టెక్నాలజీ కంటెంట్‌ క్రియేటర్లు ఇలా వీడియోలు చేశారా అనే అంశం తెలియాల్సి ఉంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు