స్టార్‌ హెల్త్‌ ఐపీవో.. ఫ్లాప్‌!

3 Dec, 2021 06:34 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఆఫర్‌ చేస్తున్న షేర్లకు సరిపడా బిడ్లు కూడా దాఖలు కాలేదు. గురువారం ఇష్యూ ముగియగా 0.79 శాతం మేర సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ సంస్థలో వెస్ట్‌బ్రిడ్స్‌ క్యాపిటల్, రాకేశ్‌ జున్‌జున్‌వాలా తదితరులకు వాటాలున్నాయి. మొత్తం 4,49,08,947 షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టగా.. 3,56,02,544 షేర్లకే బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో మాత్రం పూర్తి స్థాయి బిడ్లను అందుకుంది. ఆఫర్‌ చేస్తున్న షేర్లతో పోలిస్తే 1.10 రెట్ల సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోటా కూడా 1.03 రెట్ల స్పందన అందుకుంది. కానీ, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (పెద్ద ఇన్వెస్టర్లు) పెద్దగా ఆసక్తి చూపించలేదు.  ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.870–900ను కంపెనీ ప్రకటించడం గమనార్హం. ఖరీదైన వ్యాల్యూషన్లతో కంపెనీ ఐపీవోకు రావడం కూడా పేలవ ప్రదర్శనకు కారణంగా భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు