ఊపందుకోనున్న మ‌రో టెక్నాల‌జీ, స్పందించని అమెజాన్‌

9 Jun, 2021 11:40 IST|Sakshi

ఫేస్ రిక‌గ్నైజేష‌న్ వైపు ఇన్వెస్ట‌ర్ల చూపు 

ఇప్ప‌టికే ఫేస్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ పై ప‌నిచేసిన అమెజాన్ 

ఇన్వెస్ట‌ర్ల నిర్ణ‌యంపై స్పందించ‌ని అమెజాన్‌

వాషింగ్టన్ డిసి : 4.5ట్రిలియ‌న్ల‌కంటే ఎక్కువ వ్యాపార వ్య‌వ‌హారాల్ని నిర్వ‌హించే సుమారు 50మంది పెట్టుబ‌డుల బృందం అమెజాన్‌, ఫేస్ బుక్ త‌ర‌హాలో ఫేస్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ త‌యారు చేయాల‌ని భావిస్తోంది. యుఎస్ ఫైనాన్షియల్ దిగ్గ‌జం న్యూయార్క్ లైఫ్ కు చెందిన అసెట్స్ మేనేజర్ కాండ్రియం నేతృత్వంలోని ఇన్వెస్టర్ గ్రూప్ స‌భ్యులు.. రాబోయే రోజుల్లో వ్య‌క్తిగ‌త స‌మాచారంతో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో టెక్నాల‌జీకి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా ఉండేందుకు ఫేస్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీని బిల్డ్ చేయాల‌ని యోచిస్తున్నారు. దీనిపై యూఎస్ హ్యూమన్ రైట్స్ స‌భ్యులు సైతం స్పందించారు. స్మార్ట్‌ఫోన్ ను అన్‌లాక్ చేయడానికి లేదా బ్యాంక్ అకౌంట్ల హోల్డ‌ర్ల‌ను గుర్తించ‌డానికి, రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు ప్రభుత్వాలు ఫేస్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. 

ఇందులో భాగంగా ఈ ఫేస్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ  అభివృద్ధి చేసే సంస్థ‌లు లేదా,  ఉపయోగించుకునే సంస్థలతో రెండేళ్ల పాటు క‌లిసి ప‌నిచేస్తామ‌ని ఇన్వెస్టర్ గ్రూప్ స‌భ్యులు తెలిపారు.అమెజాన్, ఫేస్‌బుక్, ఆసియా టెక్ కంపెనీలైన అలీబాబా, హువావేలతో సహా 34 కంపెనీలు లీడ్ చేస్తాయ‌ని వెల్ల‌డించారు.  కాగా, ఈ ఫేస్ రిక‌గ్నైజేష‌న్ పై హువావే ప్రతినిధి  మాట్లాడుతూ “సాంకేతిక పరిజ్ఞానం మానవ, సామాజిక మరియు పర్యావరణ శ్రేయస్సును పెంచడానికి మాత్రమే ఉపయోగించాలి. అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ  చుట్టూ నీతి మరియు పరిపాలన ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామ‌ని తెలిపారు.   

స్పందించ‌ని అమెజాన్ 
ఫేస్ రికగ్నైజేష‌న్ టెక్నాల‌జీపై అమెజాన్ స్పందించ‌లేదు. గ‌తంలో అమెజాన్ ఫేస్ రికగ్నైజేష‌న్ టెక్నాల‌జీని త‌యారు చేసి  ఐఎన్‌సీ వెబ్‌డెవలపర్స్‌కు అమ్మింది. ఈ టెక్నాల‌జీ సాయంతో అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌(ఏసీఎల్‌యూ) నిర్వహించిన పరీక్షలో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి నిందితుల్లో 28 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉన్నార‌ని చూపించింది.దీనిపై వివాదం తలెత్త‌డంతో  ఫేస్‌ ఐడీ టూల్‌ సెట్టింగ్స్‌ను పరిశీలిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లైఫ్ కు చెందిన ఇన్వెస్టర్స్ బృందం స‌భ్యుల నిర్ణ‌యంపై అమెజాన్ తో పాటు ఇత‌ర సంస్థ‌లు స్పందించ‌లేదు.

చ‌దవండి :   ఆర్టిఫిషియల్‌ ఐ... ప్రమాదాన్ని ముందే చెప్పేస్తుంది!

మరిన్ని వార్తలు