ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!

12 Jan, 2022 21:18 IST|Sakshi

ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు అందించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం(ఎఫ్‌వై23)లో కూడా 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు విప్రో బుధవారం తెలిపింది. కోవిడ్ ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కంపెనీ 'చాలా అప్రమత్తంగా' ఉన్నట్లు సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. రాబోయే నాలుగు వారాలపాటు ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు.

''ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇప్పుడు ఒక ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మాకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, 65 శాతం మందికి పైగా సెకండ్ డోస్ వేసుకున్నట్లు" సంస్థ తెలిపింది. "రెండు డోసుల టీకాలు వేసుకున్న ఉద్యోగులను హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా కార్యాలయానికి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. మా ఉద్యోగుల భద్రత, క్లయింట్ ప్రాధాన్యతలు రెండింటినీ దృష్టిలో ఉంచుకొని 4 వారాలు కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించినట్లు" 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న తరుణంలో సీఈఓ పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,969 కోట్లుగా నమోదయ్యింది.

(చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్‌ మార్కెట్‌లో రేట్లు ఇలా..!)

మరిన్ని వార్తలు