విప్రో క్యూ3 ఫలితాలు: ఆదాయంలో భేష్‌..అక్కడ మాత్రం..!

12 Jan, 2022 20:47 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో 2021 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2419.8 కోట్లను పొందింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ. 2649.7 కోట్లను గడించింది. ఈ క్యూ3లో నికరలాభాలు 8.67 శాతం తగ్గాయి. 

ఇక కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ3లో రూ.15,278 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 21.29 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ3లో ఆపరేషన్స్‌ రెవెన్యూ రూ. 12, 596 కోట్లను నమోదు చేసింది. కాగా రెవెన్యూలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ రాబడిని విప్రో నివేదించింది. ఈ క్యూ3లో కంపెనీ 30 శాతం రాబడి వస్తోందని విశ్లేషకులు నివేదించారు. 

► కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ  ఆదాయం రూ. 20,313 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.3 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది.  

► ఐటీ సేవల విభాగంలో 2.3 శాతం వృద్ధితో 2,639.7 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని విప్రో సాధించింది.  కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది.

► మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్‌ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ... బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్‌ఈలో షేరు విలువ (0.40 శాతం నష్టపోయి రూ.691.85 వద్ద ముగిసింది.

చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్‌ మార్కెట్‌లో రేట్లు ఇలా..!

మరిన్ని వార్తలు