ఊహించని షాక్‌.. భారత్‌లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్‌!

2 Dec, 2022 16:09 IST|Sakshi

కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌. భారతలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 17 లక్షలకు పైగా రూల్స్‌ పాటించిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 56 లక్షలకు వరకు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్‌ నుంచి తొలగించింది.

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో రోజు కొన్ని లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే అందులో తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్‌నెయిల్స్‌, నిబంధన పాటించని వీడియోలు స్పామ్ కామెంట్లు వంటివి కలిగి ఉన్న వీడియోలను 50 లక్షలకు పైగా తొలగించింది. డేటా ప్రకారం, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరీక్షించిన తర్వాత 99 శాతం కామెంట్లు తొలగించింది. మెషీన్ల ద్వారా గుర్తించి వీడియోలలో 36 శాతం వీడియోలు ఒక వ్యూస్‌ కూడా పొందకముందే తీసేవేసింది. కంపెనీ అనుసరిస్తున్న నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది.

యూట్యూబ్‌ దీనిపై స్పందిస్తూ.. “మేము ఇందులో మెషీన్ లెర్నింగ్‌తో హ్యూమన్ రివ్యూయర్‌ల కలయిక ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తున్నాము. మా ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల కంపెనీ మార్గదర్శకాలకు లోబడి పని చేస్తుంటాయి. ఇవి ఉల్లంఘనలకు పాల్పడిన వీడియోలను గుర్తించడంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది.

చదవండి: బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు