పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..

4 Mar, 2021 08:03 IST|Sakshi
కేశవమురళి పెళ్లినాటి ఫొటో  

పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని నవ వధువు ఉడాయించిన ఘటన కమ్మవారిపల్లిలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం.

పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి:
తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్‌..!   
ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు