పాప పేరుతో తీయని మాటలు.. ఆపై..

15 Jun, 2021 09:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): సైబర్‌ నేరగాళ్లు తీయని మాటలతో అమాయకులను దోచేస్తున్నారు. బిస్కెట్‌ కంపెనీ పిల్లలకు నిర్వహిస్తున్న కమర్షియల్‌ స్టార్‌ అనే పోటీలో అవకాశమిప్పిస్తామని రూ.16.7 లక్షలు కైంకర్యం చేశారు. వైట్‌ఫీల్డ్‌ వాసి అమిత్‌ తల్వార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనీస్, రిషి కపూర్‌ అనే ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. అమిత్‌ తల్వార్‌ను సంప్రదించిన ఈ ఇద్దరూ మీ పాపను ప్రముఖ బిస్కెట్‌ కంపెనీ నిర్వహిస్తున్న కమర్షియల్‌ స్టార్‌ అనే పోటీలో విజేత అయ్యేలా చూస్తామని, ఖరీదైన బహుమతులు లభిస్తాయని నమ్మించారు.

వారి పాప, కుటుంబం ఫోటోలను ఈమెయిల్‌లో తీసుకున్నారు. కొన్నిరోజులకు ఫోన్‌ చేసి మీ కుమార్తె ఎంపికైందని, రెండో రౌండ్‌కు వెళ్లాలని పాప నృత్యం చేసే వీడియోలు తీసుకున్నారు. ఫీజు పేరుతో రూ.1.4 లక్షలు వసూలు చేశారు. ఇలా ఫోటోషూట్, ఫ్యాషన్‌ సామగ్రి కొనుగోలు పేర్లతో పలుదఫాలు రూ.16.7 లక్షల బదిలీ చేసుకున్నారు. చివరకు బాధితునికి అనుమానం వచ్చి ఆరా తీయగా అటువంటి పోటీలు ఏవీ లేవని తేలింది. దీంతో వైట్‌ఫీల్డ్‌ సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. 

చదవండి: విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య

మరిన్ని వార్తలు