గేమింగ్‌ యాప్‌ స్కామ్‌.... సుమారు రూ. 17 కోట్లు స్వాధీనం

10 Sep, 2022 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి ఆవరణలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్‌ఖాన్‌ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. 

ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ నగ్గేట్స్‌ అనే మొబైల్‌ గేమింగ్‌ యాప్‌తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్‌ఖాన్‌తోపాటు మరికొంత మంది పై ఫెడరల్‌ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు.

ఈ మేరకు ఈడీ గేమింగ్‌ స్కామ్‌ గురించి మాట్లాడుతూ....తొలుత వినియోగ దారులకు గేమింగ్‌ యాప్‌ ప్రారంభంలోనే మంచి కమిషన్‌ వాలెట్‌లు అందించి విశ్వాసాని పొందుతాయి. ఆ తర్వాత వారి నుంచి ఎక్కుక కొనుగోళ్లను చేయించి అనుహ్యంగా వారి వాలెట్‌లో ఉన్న మనీ అంతా స్వాహా చేసి అకస్మాత్తగా యూప్‌ పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత రీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటు రావడం మొదలవుతుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. 

(చదవండి: రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన అమిత్‌ షా... సీఎం సొంత గడ్డ నుంచి ప్రచారం)

మరిన్ని వార్తలు