మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని..

1 Jun, 2022 19:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): భార్య అదృశ్యమైన  ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి కుమ్మరి బజార్‌లో వల్లెపు లక్ష్మణ,  కుమారిల కుటుంబం నివాసం ఉంటుంది. లక్ష్మణ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, కుమారి దుర్గగుడిలో స్వీపర్‌గా పని చేస్తుంది.
చదవండి: సహజీవనం చేసి.. తల్లిని చేశాడు.. ఆస్తిలో భాగం కావాలి.. తర్వాత ఏం జరిగిందంటే?

కుమారి గత కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయం తెలిసి లక్ష్మణ భార్యను నిలదీశాడు. మరో సారి ఇటువంటి పనులు చేయనని పెద్దల మధ్యన రాజీ కుదిరింది. మంగళవారం ఉదయం కుమారి ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదు, ఇంటి కాగితాలు తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో భర్త తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు