చిన్ననాటి స్నేహితులు.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, యువకుడు మృతి

24 Jan, 2022 07:44 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 

సాక్షి, హైదరాబాద్‌: ఎదిగి వచ్చిన కుమారులు అండగా ఉంటారనుకున్న ఆ కుటుంబాలకు శోకమే మిగిలింది. చెట్టంత తనయులను విగతజీవులుగా చూసి భోరుమంటూ విలపించాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కర్బల మైదాన్‌ చౌరస్తాలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అరుణ్‌ కుమార్‌ కుమారుడు అఖిల్‌ కుమార్‌ (26) బీటెక్‌ పూర్తి చేసి అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఓల్డ్‌గాస్మండికి కాలే జ్ఞానేశ్వర్‌ కుమారుడు రోహిత్‌ (26) ఈవెంట్స్‌ నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు.
చదవండి: నర్సు ఆత్మహత్య.. ఆమె చాటింగ్‌ పరిశీలిస్తే..!

అఖిల్, రోహిత్‌లు చిన్ననాటి స్నేహితులు. రోహిత్‌కు ఈవెంట్‌ ఉండటంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి సామగ్రి కోసం ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌ మీదుగా ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి 1.10 గంటల ప్రాంతంలో వీరి వాహనం నెక్లెస్‌ రోడ్‌ నుంచి కర్బల మైదాన్‌ చౌరస్తాకు వచ్చింది. అదే సమయంలో ట్యాంక్‌బండ్‌ నుంచి ప్యారడైజ్‌ వైపు వెళుతున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం కొద్ది దూరంలో ఎగిరిపడిపోయింది.

తీవ్ర గాయాలపాలైన అఖిల్, రోహిత్‌లను అంబులెన్స్‌లో కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఖిల్‌ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్‌ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. అఖిల్‌ తండ్రి అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహన డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.  
చదవండి: ఇంటర్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం.

మరిన్ని వార్తలు