లైంగిక వేధింపులు: స్నేహితులతో కలిసి తండ్రిని చంపిన బాలిక

24 Nov, 2021 20:58 IST|Sakshi

బెంగళూరు: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కుమార్తెని చెర పట్టాలని చూశాడు. సహనం నశించిన బాలిక స్నేహితుల సాయంతో మృగాడిలా మారిన తండ్రిని హత్య చేసింది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

మృతి చెందిన వ్యక్తి పేరు దీపక్‌. బిహార్‌కు చెందిన ఇతడు.. పొట్టకూటి కోసం బెంగళూరు వచ్చాడు. నగరంలోని జీకేవీకే క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసుకుంటూ... భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తుండేవాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే దీపక్‌ రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. బెంగళూరులో ఇతడితో పాటు ఉంటున్నది రెండో భార్య, ఆమె సంతానం. 
(చదవండి: 1959లో హత్యాచారం.. డీఎన్‌ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్‌ ఏంటంటే)

రెండో భార్య పిల్లల్లో పెద్ద కుమార్తె బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదువుతోంది. బిడ్డపై కన్నేసిన దీపక్‌.. బాలికను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఇలా తరచుగా జరుగుతుండేది. ఈ క్రమంలో సోమవారం ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన దీపక్‌.. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సహనం నశించిన బాలిక.. తన స్నేహితులకు విషయం చెప్పి.. సాయం చేయడానికి రమ్మని కోరింది. 
(చదవండి: లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’)

గతంలో బాలిక.. తన తండ్రి వికృత చేష్టల గురించి స్నేహితులతో చెప్పుకుని బాధపడేది. అందుకే ఆమె కాల్‌ చేసిన వెంటనే.. దీపక్‌ ఇంటికి చేరుకున్న బాలిక స్నేహితులు.. ఇరుగుపొరుగు వారు.. అతడిపై దాడి చేసి చితకబాదారు. ఈ క్రమంలో దీపక్‌ మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు.. దీపక్‌ కుమార్తెతో పాటు.. ఆమె స్నేహితులపై కేసు నమోదు చేశారు. 

చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడితో గొడవ.. ఇంతలోనే..

మరిన్ని వార్తలు