కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..

28 May, 2022 15:27 IST|Sakshi

కెలమంగలం(బెంగళూరు): కుమారుడు జన్మించినట్లు శుభవార్త అందడంతో ఆస్పత్రికి వెళ్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  డెంకణీకోట కోటైవాసల్‌ ప్రాంతానికి చెందిన శరవణన్‌(30)ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతని భార్య ప్రభావతి కెలమంగలం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శరవణన్‌ స్వీట్లు తీసుకొని అదే రోజు రాత్రి బైక్‌లో ఆస్పత్రికి బయలుదేరాడు. కళుగోపసంద్రం వద్ద ఎదురుగా వచ్చిన పికప్‌ వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డెంకణీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరో ఘటనలో..

మూడో అంతస్తు పైనుంచి పడి బాలుడి మృతి 
బనశంకరి: ఓ బాలుడు మూడో అంతస్తు పైనుంచి అదుపు తప్పి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన బంట్వాళ నగరపోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కల్కడ నివాసి అహ్మద్‌ కుమారుడు మహమ్మద్‌సాహిల్‌(10) ఆరో తరగతి చదువుతున్నాడు. గుళ్లమజలు సిటీప్లాజా రెసిడెన్సీ మూడో అంతస్తు సిటీహౌస్‌లో ఈనెల 26 తేదీ సాహిల్‌ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అదుపుతప్పి పై నుంచి కిందపడ్డాడు.ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం  మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: Karnataka: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?

మరిన్ని వార్తలు