తీవ్ర విషాదం.. రెండు రోజుల క్రితం తమ్ముడు.. ఇప్పడు రశ్మితా

2 Oct, 2022 09:44 IST|Sakshi
రశ్మిత నాయిక్‌(ఫైల్‌)

సాక్షి, ఒడిశా(జయపురం): స్థానిక పారాబెడలో నివసిస్తున్న గదాధర నాయిక్‌ ఇంటిలో మరో విషాదం నెలకొంది. తన 12 ఏళ్ల కుమారుడు శిభాశిస్‌ నాయిక్‌ ఆత్మహత్య చేసుకొని మరణించి రెండు రోజులు గడవక ముందే కూతురు రశ్మితా నాయిక్‌(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది.

వరుసగా ఆ ఇంట్లో రెండు ఆత్మహత్యలు జరగడంతో కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అసలు తమ బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు పట్టిందో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అయితే తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకే రశ్మితా నాయిక్‌ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

చదవండి: (బిగ్‌షాట్‌లే టార్గెట్‌: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం)

 

మరిన్ని వార్తలు