తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...

1 Jun, 2022 13:57 IST|Sakshi

ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు.

వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్‌ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్‌ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు పోలీసులు కేశవన్‌పై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్‌ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్‌ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్‌ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్‌ పోలీసులు నిర్థారించారు.

(చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..)

మరిన్ని వార్తలు