Aratikaya Karam Podi: అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్‌ ఉంటుంది

1 Dec, 2023 16:12 IST|Sakshi

అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి:
అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా;
మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను;
ధనియాలు – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను;
ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు;
ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. 

తయారీ విధానమిలా:

  • స్టవ్‌ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి.  
  • స్టవ్‌ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.
  • చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. 
మరిన్ని వార్తలు