చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

2 Dec, 2023 15:50 IST|Sakshi

చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి:

చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు;
పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు;
ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను;
కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత
ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను;


తయారీ విధానమిలా:

  • పెసరపప్పుని కడిగి కుకర్‌ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్‌ రానివ్వాలి.
  • చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి.
  • ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి.
  • ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. 

మరిన్ని వార్తలు