Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..

18 Mar, 2023 12:39 IST|Sakshi

రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా...

ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అంటే ఎక్కువ మంది యాపిల్‌ గురించి మాట్లాడతారు. కానీ దానితో సమానంగా దానిమ్మ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చాట్, స్వీట్‌ డిష్, ఐస్‌ క్రీమ్, స్మూతీస్‌ ఇలా ఏది చేసినా దాని మీద తప్పనిసరిగా గార్నిషింగ్‌ కోసం దానిమ్మ గింజలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏదోవిధంగా దానిమ్మను తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటే  తప్పకుండా దానిమ్మ పండ్లు తినడం అలవాటు చేసుకోండి.

దానిమ్మ వల్ల ప్రయోజనాలు
►దానిమ్మ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి.
►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయి.
►వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్‌ నుంచి మనలని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తుంది. శరీరం నుంచి అదనపు కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది.

►రక్తాన్ని పలుచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగుపరిచి రక్తప్రసరణకి ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది.
►జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు.

కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు తింటే..
►దానిమ్మలోని గుణాలు ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. దానిమ్మ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
►గుండె పోటు, స్ట్రోక్‌ రాకుండా అడ్డుకుంటుంది.
►అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు మూడు దానిమ్మ పండ్లు తింటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వాస్కులర్‌ డిసీజ్‌ బారిన పడకుండా కాపాడుతుంది.
►రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు మందులు వాడే ముందు రోజూ దానిమ్మను తిని చూడటం ఉత్తమం. ఎందుకంటే దానిమ్మ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.

తొక్కల్లో కూడా..
►దానిమ్మ పండులోనే కాదు తొక్కల్లో కూడా విటమిన్‌ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్‌ బి6 పోషకాలు ఉన్నాయి.
►అందుకే దానిమ్మ గింజలు తిన్నతర్వాత తొక్కలు పడేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని పెట్టుకోండి. 
►కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు దానిమ్మ తొక్కలు ఎండబెట్టుకుని చేసుకున్న పొడిని నీళ్ళలో వేసి మరిగించి తాగితే మంచిది. 
►దానిమ్మ తొక్కల పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్ట్‌ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను అధిగమించవచ్చు. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

చదవండి: Summer Healthy Juices: టొమాటో జ్యూస్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా.. అయితే!
Beauty Tips: ఉల్లిపాయ రసం, ఆలివ్‌ ఆయిల్‌తో.. మచ్చలకు చెక్‌! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు