Beauty Tips: నల్ల ద్రాక్షతో ఫేస్‌ప్యాక్‌.. రిజల్ట్‌ తెలిస్తే షాకవుతారు

28 Aug, 2023 13:02 IST|Sakshi

జిడ్డుతత్వం ఉన్న చర్మానికి గ్రేప్స్‌ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్‌ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్‌ చేసిగుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతిమంతంగా.. యంగ్‌లుక్‌తో కనిపిస్తుంది.

ఒక కప్పు ద్రాక్ష పళ్లు తీసుకుని చేతులతో పిసికి గుజ్జులా చేయాలి. వాటిలో రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు తాలూకు మచ్చలు పోయి చర్మం మృదువుగా మెరుపులీనుతుంటుంది. 

చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. 

మరిన్ని వార్తలు