Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!

12 Jul, 2022 17:00 IST|Sakshi

గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం!

చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి:  
చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.)
గోధుమ పిండి –2 కప్పులు
గోరువెచ్చని నీళ్లు – సరిపడా
మైదాపిండి – 1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర  తురుము – 2 టేబుల్‌ స్పూన్లు
కారం – 1 టీ స్పూన్‌
పసుపు – చిటికెడు
గరం మసాలా – 1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా

తయారీ:
ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి.
అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్‌ నూనె వేసుకోవాలి.
సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.
ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్‌ కీమా- చీజ్‌ సమోసా తయారీ ఇలా!
Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్‌ తయారీ ఇలా!

మరిన్ని వార్తలు