Sakshi News home page

శతమానం భారతి: లక్ష్యం 2047 జీఎస్టీ సత్తువ

Published Tue, Jul 12 2022 5:02 PM

Azadi Ka Amrit Mahotsav: Shatamanam Bhavati - Sakshi

భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి ఈ జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్‌–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది.  చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది.  

జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్‌ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. అప్పట్లో జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగదారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్యవాదాలు’’ అని. నిజంగానే జీఎస్టీ, భారత్‌ను సింగిల్‌ మార్కెట్‌ని చేసింది.. ఈ ధోరణి.. రాగల సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక పురోగతికి తప్పక తోడ్పడుతుంది.  

Advertisement

What’s your opinion

Advertisement