-
టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే
టీవీ చూస్తూ చాలా పనులు చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది దర్జాగా రిమోట్ తిప్పుతూ టీవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏ సిరీయల్లో చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అలాగే కూరగాయలు కట్ చేస్తూనో, పిల్లలకు అన్నం తినిపిస్తూనో టీవీ షోలను చూస్తూ ఉంటారు. పరధ్యానంగా టీలో పంచదారకు బదులు ఉప్పు వేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదేమో కానీ ఒక్కోసారి ఊహించని సమస్యకి దారి తీస్తుంది. మహిళ టీవీ చూస్తూ ఒకటి చేయబోయి.. ఇంకోటి చేసి ఆ తరువాత ఇబ్బందులు పడింది. పరధ్యానానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన తరువాత ఇపుడు మనమంతా కాస్త జాగ్రత్త పడాల్సిన వార్త ఇది. అసలు విషయం ఏమిటంటే..డైలీ స్టార్ కథనం ప్రకారం మియా కిట్టిల్సన్ అనే మహిళకి బెక్ హమ్(Beckham) డాక్యు సిరీస్ అంటే పిచ్చి. దీనిపై బాయ్ ఫ్రెండ్‌తో చర్చిస్తుంది కూడా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా పెయిన్ కిల్లర్ క్రీమ్ డీప్ హీట్ క్రీమ్ వాడేసింది. ఇంకేముందు నోటిలో చురుక్కున మండడంతో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. ఘాటైన వాసనతో ఇబ్బంది పడింది. దీంత విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు. తన షాకింగ్ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. అది కోల్గేట్ టూత్పేస్ట్లానే ఉంది అంటూ నొప్పి నివారణ క్రీమును వాడిన వైనాన్ని వివరించింది. దీంతో నెటిజను కమెంట్ల వర్షం కురిపించారు. టిక్‌టాక్‌లో కిట్టెల్సన్ వీడియోకు వచ్చిన వ్యూస్ 10 లక్షలకు పై మాటే అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏమేరకు వైరల్ అయిందో. ఇది ఇలా ఉంటే గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ కోల్డ్ సోర్ క్రీం బదులుగా పెదాలకు సూపర్‌గ్లూను రాసేసుకుంది. తెలుసుగా గ్లూ రాసుకుంటే ఏమవుతుందో.. పెదాలకు అతుక్కుపోయి నానా బాధలు పడింది. విపరీతమైన జలుబుతో బాధపడింది. చివరికి వైద్యులు పారాఫిన్ ఆయిల్‌తో ఆమె పెదవుల సీల్‌ను విప్పారు. సో.. తస్మాత్ జాగ్రత్త! -
దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!
దంతాలకు ఈ పేస్టు/టూత్ పౌడర్ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్‌ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. దంత సమస్యలకు కారణం.. ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. డీ, బీ, సీ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి. దంతాలు పైన ఉండే ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పేస్ట్ బెటర్! మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్‌లు, పౌడర్లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి. ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు. ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఆయా టూత్ పేస్ట్‌లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు. దంత సమస్యలకు నివారణ.. ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్‌గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్ తోపాటు కాట్రోల్ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు. ---ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
లైవ్‌లో ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం చేస్తూ..ఓ యూట్యూబర్..
ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆన్లైన్ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్ కూడా అలానే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది. కొన్ని లైవ్ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్లు ముందుగా ట్రయల్స్ వేసిగానీ రిస్క్ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం. జంబో రేంజ్లో టూత్ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ యూట్యూబర్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్ని అందిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం ఏంటంటే.. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్ జాగ్రత్త..! (చదవండి: అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!) -
Viral Video: టూత్ బ్రెష్ తో బుల్లి తాబేలుకు స్నానం
-
సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌కు భారీ జరిమానా.. ఆ యాడ్ వెంటనే తొలగించండి!
న్యూఢిల్లీ: ప్రముఖ టూత్‌పేస్ట్ ఉత్పత్తుల సంస్థ సెన్సోడైన్'పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) అసహనం వ్యక్తం చేసింది. కొద్ది రోజులగా టీవిలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సంస్థపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో.. 'ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్‌పేస్ట్ సెన్సోడైన్', 'ప్రపంచ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్' అని వచ్చిన వ్యాఖ్యలపై సీసీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశీ దంతవైద్యుల ఎండార్స్ మెంట్లను చూపించే ప్రకటనలను సీసీపీఏ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిలిపివేయాలని ఆదేశించారు. నిధి ఖరే నేతృత్వంలోని సీసీపీఏ ఇటీవల సెన్సోడైన్ ఉత్పత్తుల తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్‌తో సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సెన్సోడైన్ ఉత్పత్తుల ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా చర్యలు తీసుకుంది. ఈ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా సర్వే జరిపినట్లు సంస్థ ఎలాంటి వివరాలను తమకు సమర్పించలేదని పేర్కొంది. కేవలం మన దేశంలోని భారతదేశంలోని దంతవైద్యులను సర్వే చేసి రూపొందించిన ప్రకటనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దంతవైద్యులు సిఫార్సు చేస్తున్నట్లు చూపించడం సబబు కాదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది. అందుకే, ఈ ప్రకటనలను 7 రోజుల్లోగా తొలగించాలని పేర్కొంది. (చదవండి: వాహనదారులకు గూడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
టంపాబేలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024)
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
కేజ్రీవాల్‌కు బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement