గడప దాటని  నాంపల్లి బ్రదర్స్‌ 

18 Nov, 2023 08:00 IST|Sakshi

మరో రెండు వారాల్లోనే పోలింగ్‌ జరగనుంది. కానీ ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు రాష్ట్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే కూర్చొని ప్రతీరోజు మీడియా సమావేశాలతోనే కాలం వెళ్లబుచ్చుతుండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నాయకులకు ఏకంగా నాంపల్లి బ్రదర్స్‌ అంటూ పార్టీలోని కేడర్‌ ముద్దు పేరు కూడా పెట్టేసింది.

జాతీయ నాయకులు పర్యటనకు వచ్చినప్పుడు మినహా వారు బయట పర్యటనలకు ఎక్కువగా సమయం కేటాయించడం లేదట. అదేమంటే..ఇక్కడ కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారట. జాతీయస్థాయిలో సీనియర్‌ నేతలైన  ఆ ఇద్దరూ  కనీసం తమ జిల్లాల్లోని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మోయాల్సి ఉన్నా.. కనీసంగా పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుండటంతో ఆయా జిల్లాల పార్టీ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారట.

ఇక పార్టీ ఆఫీసులోనే కూర్చొని అప్పుడే అధికారంలోకి వచ్చేశామన్నట్టుగా వారిద్దరూ ఇచ్చే బిల్డప్‌ చూస్తుంటే పార్టీ శ్రేణులకు మాత్రం ఎక్కడో కాలుతోందట.   

మరిన్ని వార్తలు