అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిని నేనే.. తనను తానే ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు

17 Aug, 2021 21:53 IST|Sakshi

కాబుల్‌: అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసాక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఉపాధ్యక్షడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని, త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వారందరిని కలుస్తానని ట్విటర్‌లో పేర్కొన్నారు.


చదవండి: అల్లకల్లోల అఫ్గాన్‌: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ

మరిన్ని వార్తలు