అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులపై ప్రధాని మోదీ కీలక సమావేశం

17 Aug, 2021 22:24 IST|Sakshi

న్యూఢిల్లీ : అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులపై ప్రధాని మోదీ మంగళవారం సెక్యూరిటీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఆయన చర్చించారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయమై రేపు మరోసారి సెక్యూరిటీ కేబినెట్ కమిటీ భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. భారత పౌరులను తరలించే అంశంపై రేపు మరోసారి చర్చించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్ల, అఫ్గానిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిని నేనే.. తనను తానే ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు

మరిన్ని వార్తలు