-

అఫ్గాన్‌ గురుద్వారాలో పేలుళ్లు

19 Jun, 2022 05:29 IST|Sakshi

కాబూల్‌/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని కర్తే పర్వాన్‌ గురుద్వారా వద్ద శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, మరొకరు భద్రతా సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో గురుద్వారా గేటుపైకి దుండగులు గ్రనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో ఒక అఫ్గాన్‌ సిక్కుతోపాటు భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారు.

అనంతరం దుండుగులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గురుద్వారా వైపు వస్తుండగా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని అఫ్గాన్‌ తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దాడి ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, అఫ్గాన్‌లోని మైనారిటీలపై తరచూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. అఫ్గాన్‌లోని గురుద్వారాపై దాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. 

ఇది కూడా చదవండి: రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్‌!

మరిన్ని వార్తలు