పాపులర్‌ బాడీ బిల్డర్‌ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత

24 Nov, 2023 18:38 IST|Sakshi

పాపులర్‌  బాడీ బిల్డర్‌, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో  డువార్టే  రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్‌తో  మరణించారు.  బ్రెజిల్‌కుచెందిన ఈయన సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్‌మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను  రొడాల్ప్‌  స్పోర్ట్స్ మెడిసిన్  అడ్‌  ఫార్మకాలజీ క్లినిక్‌  ఖండించింది.

కాలేయంలో ట్యూమర్‌,రక్తస్రావం కారణంగా సావో పాలోలో  రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. 

తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో  వీడియోలను  కూడా ఎక్కువగా పోస్ట్‌ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

A post shared by Caroline Sanches (@carolinessanches)

సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న  ఈయన క్లినిక్‌ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్‌  అతను గిటార్ వాయిస్తూ  ‘మన  మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’   అంటూ పాడుతున్న  వీడియోను ఎప్పటి  ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. 

A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos)

మరిన్ని వార్తలు