అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్‌

25 Dec, 2023 06:05 IST|Sakshi

చైనా కమ్యూనిస్టు నేతలకు హితవు

బీజింగ్‌: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్‌ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.

అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్‌ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది.

>
మరిన్ని వార్తలు