‘ప్లాస్టిక్‌ అడవి’లో ఏనుగులు 

24 Sep, 2023 03:36 IST|Sakshi

ఎటు చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు.

ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్‌ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో లలిత్‌ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్‌ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్‌ ఇన్‌ఫోకస్‌ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్‌ ఫోకస్‌’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు