ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు బంద్‌..

5 Oct, 2021 02:49 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన సర్వీసులు

పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న యాజమాన్యం

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సోమవారం అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వివిధ దేశాల్లో వీటి సేవలు స్తంభించాయి. ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన ఈ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వెళ్లకపోవడం, రాకపోవడం, కొత్త పోస్టులు కనబడకపోవడంతో నెటిజన్లు ఇతర వేదికల్లో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌ తన వెబ్‌సైట్‌లో స్పందిం చింది. అంతరాయానికి కారణం ఏమిటనేది వెల్లడించలేదు.

‘‘మన్నించాలి. ఏదో తప్పిదం జరి గింది. మేము దానిపైనే పని చేస్తున్నాం. వీలైనంత త్వరలో సేవల్ని పునరుద్ధరిస్తాం’’ అని పేర్కొంది. నెటిజన్లు సహనంతో ఉన్నందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌ తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపాయి ‘‘వాట్సాప్‌ పని చెయ్య డం లేదని సమాచారం అందింది. సమస్యను పరిష్కరించి సేవల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరలో వీటి సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని ట్వీట్‌ చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 41 కోట్ల మందికి పైగా యూజర్లు ఉంటే, వాట్సాప్‌ని 53 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ఇకఇన్‌స్టాగ్రామ్‌లో 21 కోట్ల మందికి ఖాతాలు ఉన్నాయి. కాగా, అర్ధరాత్రి దాటాక కూడా సేవల పునరుద్ధరణ జరగలేదు. 

(చదవండి: ‘పండోరా పేపర్స్‌’.. వారి గుట్టురట్టు చేయనున్న కేంద్రం!)

మరిన్ని వార్తలు